![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -419 లో... కావ్యకి పోటీగా మాయ ఇంట్లో పనులు చేస్తుంది. కావ్య కంటే ముందే మాయ అందరికి కాఫీ తీసుకొని వెళ్తుంది. కానీ మాయ ఇచ్చిన కాఫీ ఎవరు తీసుకోరు. మాయ కావ్య ఇద్దరు ఒకేసారి కాఫీ తీసుకొని వచ్చి అపర్ణకి ఇస్తారు. అపర్ణ మాయ తీసుకొని వచ్చిన కాఫీ తీసుకుంటుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఇంట్లో అందరికి కరెక్టే ఇచ్చానా అని కావ్యని మాయ అడుగుతుంది. అందరిని కాదు నీ బాబుని చూసుకో చాలని కావ్య అంటుంది. బాబు బాత్రూం వెళ్లాడు.. స్నానం చేయించు అని బాబుని మాయకి ఇస్తుంది కావ్య.
ఆ తర్వాత బాబుని చూసి మాయ చిరాకు పడుతూ.. నాకు కొంచెం హెల్ప్ చెయ్యండి అని రుద్రాణిని పిలుస్తుంది. ఇద్దరు కలిసి బయటకు వెళ్తారు. బాబుని పట్టుకొని.. ఛీ నేను కడగనని మాయ అంటుంది. నటించడానికి వచ్చినప్పుడు ఇలాంటివి కూడా చెయ్యాలని రుద్రాణి అంటుంది. ఇబ్బంది పడుతూ మాయ చేస్తుంటే.. రుద్రాణి వాటర్ పోస్తుంది. అలా చేస్తుంటే అప్పుడే స్వప్న వచ్చి.. ఇలాగే ప్రాక్టీస్ చెయ్యండి అని అంటుంది. మరొక వైపు రాహుల్ తన ఫ్రెండ్ కి కాల్ చేసి.. నువ్వు అక్రమంగా తీసుకొని వచ్చిన గోల్డ్ ఇప్పుడు నేను కొంటాను ఎందుకంటే ఇప్పుడు మా కంపెనీకి నేనే ఎండీ అని రాహుల్ చెప్పగానే.. తన ఫ్రెండ్ సరే అంటాడు. ఆ తర్వాత అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు.
నువ్వు టిఫిన్ రెడీ చెయ్యలేదా కావ్య అని ఇందిరాదేవి అడుగుతుంది. చేసానని కావ్య అంటుంది. రాజ్ ఎక్కడ అని రాహుల్ అడుగుతాడు.రాజ్ కి ఇష్టమైన టిఫిన్ చేసానని మాయ చెప్తుంది. రాజ్ కి ఏం ఇష్టమో నీకు తెలుసా అని రుద్రాణి అడుగుతుంది. తెలుసంటూ తన ఇష్టాఇష్టాలు మాయ చెప్తుంది. రాజ్ ఆఫీస్ వర్క్ అంటూ నిన్ను ఇన్ని రోజులు బానే మేనేజ్ చేసాడని రుద్రాణి అంటుంది. రాజ్ ఊటి బ్రాంచ్ కి వచ్చినప్పుడు అక్కడ నాకు జాబ్ ఇచ్చి ఆ తర్వాత తన మనసులో చోటు ఇచ్చాడని మాయ చెప్తుంది. ఆ తర్వాత రాజ్ టిఫిన్ చెయ్యడానికి వస్తాడు.నీకు ఇష్టమైన టిఫిన్ చేసానని మాయ అనగానే.. నా ఇష్టాలు మార్చుకున్నానంటూ కావ్యని టిఫిన్ తీసుకొని రమ్మని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మాయ చేసిన టిఫిన్ ఎవరు తినరు.. అందరు వెళ్ళిపోతారు. దీనికి నువ్వే సొల్యూషన్ చూడాలి వదిన అని రుద్రాణి అంటుంది. మరొకవైపు అప్పు, కావ్య ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారి. ఈ మాయ గొడవలో పడి అసలు మాయ గురించి మర్చిపోయాం.. కనుక్కోవాలని కావ్య అంటుంది. తరువాయి భాగంలో కావ్యకి రాజ్ కి విడాకులు ఇవ్వాలని లాయర్ ని రమ్మని పేపర్స్ తీసుకుంటుంది అపర్ణ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |